భూమికి మరో పెను ప్రమాదం.. హెచ్చరించిన నాసా

Update: 2022-01-18 13:30 GMT
నాసా అంతరిక్షంలో ప్రయోగాలు చేపడుతూ ఖగోళ శాస్త్రం గురించి కొత్త విషయాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా వివిధ గ్రహాలు, భూమి, సూర్యుడు వంటిపై జరిగే పెను మార్పుల గురించి ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే భూమికి మరో పెను ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా తెలిపింది. భూమి వైపుగా ఓ గ్రహశకలం దూసుకువస్తోందని వెల్లడించింది. అది భూమిపై పడితే అతిపెద్ద ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది. అంతేకాకుండా భూ కక్ష్యలో వివిధ మార్పులు జరుగుతాయని పేర్కొంది. ఈ అతిపెద్ద గ్రహశకలం చుట్టూ మరికొన్ని గ్రహశకలాలు ఉన్నాయని గుర్తించింది. అయితే ఇలాంటివి వాతావరణంపై చాలా ప్రభావం చూపుతాయని తెలిపింది.

రాబర్ట్ మెక్ నాట్ అనే శాస్త్రవేత్త ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. 1994లో మొదటిసారిగా ఈ అతిపెద్ద గ్రహశకలాన్ని కనుగొన్నారు. అందుకే దీనికి 1994 పీసీ 1గా నామకరణం చేశారు. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు నాసా తెలిపింది. ఇది భూమి నుంచి 1.2మిలియన్ మైళ్ల దూరంతో ప్రయాణిస్తోంది. మరో 24 గంటల్లో ఇది భూమిని దాటి ప్రయాణించనుంది. సుమారు 1కి.మీ వ్యాసం కలిగిఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ అతిపెద్ద గ్రహశకలం చుట్టూ అనేక చిన్న గ్రహశకలాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో 24 గంటల్లో ఇది భూమిని దాటి వెళ్లనుందని చెప్పారు. అయితే ఈ దృశ్యాన్ని టెలిస్కోపు ద్వారా వీక్షించవచ్చునని పేర్కొన్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకు 5 గ్రహశకలాలు భూమిని దాటుకొని వెళ్లాయని నాసా తెలిపింది. ఇలా తరుచూ పెద్ద పెద్ద గ్రహశకలాలు భూమికి దగ్గరకు వస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వాతావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు.

ఎప్పుడూ ఏదో ప్రయోగం చేస్తూ ఉండే నాసా.. ఇటీవల గ్రహశకలాల కదలికలపై అధ్యయనం చేసింది. అందులో భాగంగానే 1994 సంవత్సరంలో గుర్తించిన గ్రహశకలం కదలికలను పరిశీలించింది. ఇది భూమికి దగ్గరగా వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనివల్ల పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
Tags:    

Similar News