మరో ఉద్యమమా బాబూ.. నిలదీసిన మాజీ సీఎస్

Update: 2021-02-07 14:30 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉక్కు ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమానికి సిద్ధం కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్కు కర్మాగారాన్ని తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేద్దామని జగన్ , ఆయన గ్యాంగ్ కుంతంత్రాలు చేస్తున్నారని.. ప్రజల మద్దతుతో దీన్ని అడ్డుకుంటామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్ ను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఐవీఆర్ మాట్లాడుతూ ‘మరో ఉద్యమం ఎందుకు తప్పదో చంద్రబాబు వివరంగా సెలవిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవమైన నిజాం షుగర్స్ ను తమరు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి పారదర్శక విధానం ద్వారా అమ్మేశారని దుయ్యబట్టారు.  ప్రభుత్వ రంగసంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికిన రాష్ట్రస్థాయి నాయకులలో తమరు ముందున్నారు అని ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో విమర్శించారు.

ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రికి రాసిన లేఖలోని రెండు అంశాలు ముఖ్యమైనవని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విశాఖ ఉక్కు కు మిగిలిన కర్మాగారాల లాగా క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తామనడం మంచి నిర్ణయమన్నారు. 22 వేల కోట్ల అధిక వడ్డీ రుణాలను ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడం లాభిస్తుందన్నారు. 


Tags:    

Similar News