ప్రపంచంపైకి మరో కొత్త మహమ్మారి.. కలకలం

Update: 2022-06-28 04:25 GMT
21వ శతాబ్ధంలో మనిషిపై వైరస్ ల దాడి ఎక్కువైంది. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది.

ఇటీవల ప్రపంచ దేశాలను 'మంకీపాక్స్' వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ నెమ్మదిగా ఇతరదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.

యూకే, అమెరికా, కెనడా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీ పాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కోతులు, ఎలుకలు, ఉడుతల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. యూకేలో శృంగారం ద్వారా కూడా సోకుతుందని.. ముఖ్యంగా గే లేదా బైసెక్సువల్ మెన్ ల ద్వారా ఇది వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ సోకితే తలనొప్పి, చలి, కండరాల నొప్ప లాంటి లక్షణాలుంటాయి.

మంకీపాక్స్ పలు దేశాల్లో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కెనడాలో డజనుకు పైగా మంకీపాక్స్ అనుమానిత కేసులు బయటపడ్డాయి. తాజాగా అమెరికాలోనూ మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది. ఇటీవల కెనడా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు అమెరికా బుధవారం ప్రకటించింది.

-కొత్తగా అంతుబట్టని 'డిసీజ్-X'కరోనా, మంకీపాక్స్ తర్వాత ఇప్పుడు డిసీజ్-X అనే కొత్త వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడించడానికి సిద్ధమవుతోంది.  ఈ వ్యాధి అంతుచిక్కని పాథోజన్ వల్ల వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 'ఇందులో X అంటే .. ఈ వ్యాధి గురించి ఏమీ తెలియదని అర్థం. ఎలా సోకుతుందా కూడా తెలియదు. ఈ వ్యాధి ప్రాణాంతకం కావొచ్చు. కాకపోవచ్చు. అంటు వ్యాధిగా మారితే జనజీవనానికి తీవ్ర ముప్పు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇలా కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతూ మనుషులను భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనాతో లక్షల మంది చనిపోయారు. ఇక దాని తర్వాత 'మంకీపాక్స్ భయపెడుతోంది. ఇప్పుడు కొత్త గా డిసీజ్ X వ్యాధి ఎలా సోకుతుంది? దాని లక్షణాలు ఏంటి? ప్రాణాంతకం అనేది కూడా తెలియదు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.
Tags:    

Similar News