యూపీలో మరో నిర్భయ ఘటన ..కదిలేబస్సులో రాత్రంతా గ్యాంగ్ రేప్ ,

Update: 2020-09-29 09:30 GMT
దేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కొత్త కొత్త చట్టాలని తీసుకువచ్చాయి...ఇంకా తీసుకువస్తున్నాయి. అలాగే మహిళపై  అత్యాచారాలు చేస్తున్న వారికి కఠిన శిక్షలు కూడా విధిస్తున్నారు. అయినప్పటికీ  కూడా మహిళపై జరిగే ఘెరాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఎన్ని చట్టాలు , ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటన మరోసారి పునరావృతమైంది. అది కూడా మహిళపై అఘాయిత్యాలకు పాల్పడే వారి ఫోటోలని భహిరంగంగా గోడలపై అతికిస్తామని చెప్తున్నా ఉత్తరప్రదేశ్ జరగడం గమనార్హం.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

శుక్రవారం (సెప్టెంబర్ 25) రాత్రి మీరట్‌లో కదులుతున్న ఓ బస్సులో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి మొత్తం  ఆమెపై అత్యాచారం చేసి కదులుతున్న బస్సు నుంచే బయటకు పడేశారు. మీరట్ ‌లోని ఢిల్లీ రోడ్డులో శనివారం ఉదయం బాధితురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె నుండి వాగ్మూలం తీసుకున్నారు.  తాను భైసాలి బస్టాండ్‌లో బస్సు ఎక్కానని చెప్పిన బాధితురాలు.. బస్సు సిబ్బంది తనకు కూల్ డ్రింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అది తాగాక అపస్మారక స్థితిలోకి వెళ్లానని, ఆపై బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని,నిందితుల కోసం గాలిస్తున్నామని మీరట్ ఎస్ఎస్పీ అజయ్ సాహ్ని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని... వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గడిచిన నెల రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. ఇటీవలి కాలంలో మహిళలపై అక్కడ నేరాలు తీవ్రంగా పెరిగిపోయాయి. యూపీలోని హత్రస్ పట్టణంలో సెప్టెంబర్ 14న ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కూడా తాజాగా వెలుగుచూసింది.
Tags:    

Similar News