మరో మహమ్మారి: కరోనా కొత్త వేరియంట్ వచ్చేస్తోంది!

Update: 2022-04-02 10:31 GMT
ప్రపంచాన్ని కరోనా ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఎంత అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపించి యూరప్ సహా పలు దేశాల్లో లాక్ డౌన్ కు కారణమైంది. ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్ మరో కొత్త రూపాన్ని సంతరించుకొని మరోసారి వచ్చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ బీఏ2  కొత్తరకం వైరస్ కేసులు తాజాగా  అమెరికాలో విజృంభిస్తున్నాయి. కొత్త కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌లలో మూడింట ఒక వంతుకు పైగా ఇవే కేసులున్నాయి. అలెర్జీ సీజన్‌ లోలాగా అమెరికాలో ఈ వేసవి మొదట్లో ఇన్ని కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లక్షణాలు మరింత క్లిష్టతరంగా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త మహమ్మారి పుట్టుకొస్తోంది. తాజాగా ‘ఎక్స్.ఈ’ అనే ఒమిక్రాన్ కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ పంజా విసురుతోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ బీఏ2 సబ్ వేరియంట్ కంటే 10శాతం అధికంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది.

‘ఎక్స్.ఈ’ కరోనా వేరియంట్ మొదటిసారిగా యూకేలో కొనుగొన్నారు. 600 కంటే ఎక్కువ ‘ఎక్స్.ఈ’ కేసులు నిర్ధారణ అయ్యాయి.  యూకేలో జనవరి 19న ఈ ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి కనుగొన్నారు. 600 కంటే ఎక్కువ ‘ఎక్స్ ఈ’ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ సంఖ్యలో  కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఎక్స్ ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్ లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్ ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ తెలిపారు.

ఎక్స్.ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకూ ఇది ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తామని డబ్ల్యూ.హెచ్.వో తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529, బీఏ1,బీఏ2 మరియు బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో బీఏ2 అని పిలవబడే స్టీల్త్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఒమిక్రాన్ యొక్క ప్రారంభ కేసు తర్వాత కొంతమందికి మళ్లీ సోకినట్లు నమోదు చేయబడింది.
Tags:    

Similar News