స్పీడ్ తగ్గినా.. బొత్స సత్తిబాబు హవాకు మాత్రం తిరుగులేదే.. తాజాగా మరో పదవి
కొందరు నేతల సుడి మామూలుగా ఉండదు. వారేం చేసినా.. చేయకున్నా వారికొచ్చే మైలేజీ.. ఇమేజ్ మామూలుగా ఉండదు. తాజాగా అలాంటి పరిస్థితి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్తిబాబు సొంతమని చెప్పాలి. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. వైఎస్ హయాంలో బొత్స ఒక వెలుగు వెలిగారని చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టుడిగా ఆయనకు పేరుంది. ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్యల కత్తి ఝుళిపించటానికి ఏ మాత్రం ఇష్టపడకపోవటమే కాదు.. ఆయన మీద ఈగ వాలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకునే వారు.
ఇందుకు తగ్గట్లే దివంగత మహానేత వైఎస్ మీద వీరాభిమానాన్ని ప్రదర్శించటమే కాదు.. ఆయన మీద ఉన్నంత విధేయత అంతా ఇంతా కాదన్నట్లు ఉండేది. అందుకు తగ్గట్లే విజయనగరం జిల్లాలో బొత్స సత్తిబాబుకు తిరుగులేదన్నట్లుగా ఉండటమే కాదు.. ఆయన కుటుంబానికి పదవుల వరద పారేది. వారికి ప్రాధాన్యత లభించిన తర్వాతే మరెవరికైనా అన్నట్లు ఉండేది.కాంగ్రెస్ తర్వాత వైసీపీలో చేరిన ఆయన.. జగన్ కు సన్నిహితంగానే వ్యవహరిస్తారు.
వైఎస్ హయాంతో పోలిస్తే.. జగన్ పాలనలో ఆయన అంత జోరును ప్రదర్శించటం లేదనే చెప్పాలి. ఆ మధ్యన విపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడినా.. అంతంత మాత్రంగానే ఉండేది. ఈ మధ్యన ఆయన.. ఆయనకుటుంబ సభ్యులు కరోనా బారిన పడటంతో.. రాజకీయంగా కాస్త వేగం సన్నగిల్లటంతో పాటు.. ఆసుపత్రుల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో.. బొత్స సత్తిబాబు స్పీడ్ గతంతో పోలిస్తే బాగానే తగ్గినట్లుగాచెబుతారు.
ఇదిలా ఉంటే.. తాజాగా బొత్స ఫ్యామిలీకి మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది. విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పదవిని బొత్స బంధువు మజ్జి శ్రీనివాసరావుకు ఇవ్వటానికే వైసీపీ అధినాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మజ్జి వైపు ఉన్న వైసీసీ సీనియర్ నాయకత్వం ఇప్పటికే ఆయనకు పచ్చజెండా ఊపినట్లుగా చెబుతున్నారు. జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న మజ్జికి సరైన పదవి దక్కింది లేదు.
పార్టీ అధికారంలో ఉన్నా.. తనకు సరైన పదవి లభించకపోయినప్పటికీ ఆయన ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు. దీంతో.. కీలకమైన విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్ కీలక పదవిని అప్పజెప్పేందుకు వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయ్యింది. దీంతో.. ఇంతకాలం విధేయుడిగా పని చేయటం లాభంగా మారిందని చెబుతున్నారు. అధికారికంగా ఈ నియామకపు వివరాల్ని వెల్లడించనప్పటికీ.. ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వాస్తవరూపం దాలిస్తే.. బొత్స హవా మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు.