ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు.. జూనియర్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53,54 జీవోలను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు.. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
ఏపీలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53,54 జీవోలు ఇచ్చింది. అయితే వీటిని సవాల్ చేస్తూ 'తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్' అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరుఫున గతంలో పిటీషన్లు వేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి.
రుసుములను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని గుర్తు చేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యాసంస్థల నిర్వహణ, మెరుగైన విద్యాబోధన సాధ్యం కాదని సీనియర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
తల్లిదండ్రులు సంతృప్తి చెంది ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పిస్తారంటూ వాదనలు వినిపించాయి. అయితే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఆ జీవోలను తోసిపుచ్చింది.