కొత్త సంవత్సరం వస్తోంది. అప్పుడే యువత, పెద్దలు రెడీ అయిపోతున్నారు. ఆడవాళ్లు, ఫ్యామిలీస్ భారీ కేకులకు ఆర్డర్ లు ఇచ్చేస్తున్నారు. ఇక యువత, ఉద్యోగులు మందు పార్టీలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే మద్యం తాగి రోడ్డెక్కితే 10వేల ఫైన్, జైలు శిక్ష అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలి..? న్యూ ఇయర్ పూట క్యాబ్ లు దొరకడం కష్టమే.. మరి ఎలా వెళ్లాలని యోచిస్తున్న మద్యం బాబులకు ‘మెట్రో రైళ్లు’ అవకాశంగా కనిపిస్తున్నాయి.
అయితే తాజాగా బెంగళూరు లో మెట్రో రైలు నిర్వాహకులు మందుబాబుల కు షాకిచ్చారు. బెంగళూరు మెట్రో అధికారులు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మందు వేసి వెళ్లేవాళ్లకు మెట్రో రైళ్లలో ‘నో ఎంట్రీ ’ ఆదేశాలను జారీ చేశారు. మందు తాగి మెట్రోలో ప్రయాణించకుండా కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ మెట్రో నిర్వాహకులు కూడా మందుబాబులను న్యూఇయర్ అర్ధరాత్రి మెట్రోలోకి అనుమతించకూడదని తాజాగా నిబంధన తేవడానికి రెడీ అయ్యారట.. సో ఇక వాహనాల్లో తాగి వెళ్లకుండా మెట్రోలో వెళదామని చూసిన మందుబాబులకు ఇది గట్టి షాక్ లా మారింది. మరి ప్రత్యామ్మాయం చూసుకుంటూనే బెటర్ అంటున్నారు నిర్వాహకులు.