లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతుండటాన్ని లవ్ జీహాద్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చాయి. ఇప్పుడు మరో రాష్ట్రం ఆ బాట పట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు ధర్మ స్వాతంత్య్ర బిల్లు 2020 అంటే మతస్వేచ్ఛ బిల్లును మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించింది.
కొత్త బిల్లుతో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మైనర్, మహిళలను బలవంతంగా మతం మార్చితే కనీసం రూ.50వేల జరిమానాతో పాటు పది సంవత్సరాల వరకు జైలు శిక్షపడనుంది. కొత్త బిల్లు ప్రకారం.. ఒకరిపై మత మార్పిడి బలవంతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్ష, రూ25వేల జరిమానా విధించనున్నట్లు హోమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ, అన్ని మతాలకు, కులాలకు చెందినది.. ఇందులో ఎలాంటి వివక్ష లేదని సీఎం అశోక్ చౌహాన్ తెలిపారు. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు రద్దు కావడంతో ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.
గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేసిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.