హేమంత్ హత్య కేసులో వెలుగులోకి మరో ట్విస్ట్ !

Update: 2020-10-02 15:00 GMT
హేమంత్ హత్య తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పరువు కోసం కన్న కూతురి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. ప్రస్తుతం హేమంత్ పరువు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ ‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల పాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకున్న పోలీసులకి విచారణలోయుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి పలు సంచనల విషయాలు చెప్తున్నట్టు తెలుస్తోంది.

హేమంత్‌తో ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్టడి చేశామని లక్ష్మారెడ్డి పోలీసులతో చెప్పాడు. అయినప్పటికీ అవంతి ఇంటి నుంచి పారిపోయి హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుందని తెలిపారు. తమది ప్రాణం కంటే పరువే ఎక్కువని భావించే కుటుంబమని... తమ కాలనీలో తమదే ఆధిపత్యమని చెప్పాడు. అవంతి ప్రేమ వ్యవహారంతో కాలనీలో తాము తలదించుకోవాల్సి వచ్చిందని ఆ కారణంతోనే హేమంత్ ను హత్యమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు.

ఇక తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. హేమంత్ హత్యకు మొదట వేరే సుపారి గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు యుగంధర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఒప్పందం కుదిరాక సుపారీ గ్యాంగ్ స్పందించకపోవడంతో హేమంత్ హత్య వాయిదా పడిందన్నారు. దీంతో తనకు పరిచయం ఉన్న బిచ్చు యాదవ్ తో మరో ఒప్పందం కుదుర్చుకున్న యుగంధర్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ సారి కరెక్ట్ గా అమలు చేశామని తెలిపారు. ఇకపోతే, సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను మరోసారి పోలీసులు తీసుకెళ్లారు.


Tags:    

Similar News