వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వివేకానందరెడ్డి హత్య కేసులో వేరే వారి పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి పెరుగుతోందని.. ఎస్పీకి, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు.
కదిరికి చెందిన అడ్వకేట్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ అధికారి రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. సీబీఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని లాయర్ కోర్టుకు తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని కడప ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే వాళ్ల ముగ్గురి పేర్లు ప్రస్తావిస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. వీళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీని పీఏ కోరారు.
వైఎస్ వివేకాకు కృష్ణారెడ్డి మంచి నమ్మకస్తుడైన పీఏగా గుర్తింపు పొందారు. 30 ఏళ్ల పాటు వివేకా వెంట ఉన్నారు. వివేకా తుదిశ్వాస విడిచేవరకూ పీఏగా కొనసాగారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందనే చర్చ సాగుతోంది.