చైనా అన్నంతనే చౌకగా వస్తువుల ఉత్పత్తి అన్న విషయమే చాలామందికి తెలుసు. ఎప్పుడైతే కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతుందో.. ఇప్పుడు ఆ దేశానికి సంబంధించి సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా తర్వాత ఆ దేశంలో పలు వైరస్ లు వెలుగు చూడగా.. తాజాగా మరో కొత్త వైరస్ ను గుర్తించారు. ఇదంతా చూస్తే.. వైరస్ లకు రాజధాని చైనా అన్న భావన కలుగక మానదు.
తాజాగా వెలుగు చూసిన వైరస్ కొత్తదేమీ కాదు. దీన్ని 2011లో కనుగొన్నారు. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఏడుగురు మరణిస్తే.. 37 మంది చికిత్స పొందుతున్నారు. ఎస్ఎఫ్ టీఎస్ గా అభివర్ణించే ఈ వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వివరాల్ని గమనిస్తే.. దాదాపు నెల నుంచే ఈ వైరస్ తాలుకూ ప్రభావం ఉండటమే కాదు.. కేసులు నమోదైన విషయం అర్థమవుతుంది.
తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో ఇప్పటికి ఈ వైరస్ బారిన 37 మంది పడ్డారు. ఇదే విషయాన్ని తాజాగా చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కూడా వెల్లడించింది. వైరస్ బారిన పడిన ఒక మహిళలో రోగ లక్షణాల్ని గుర్తించి.. అప్రమత్తం అయ్యారు. ఈ వైరస్ బారిన పడిన వారు దగ్గు.. జ్వరం సంకేతాల్ని చూపించి.. తర్వాతి దశలో ల్యూకోసైట్స్.. ప్లేట్ లెట్స్ తగ్గించేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
సరైన వైద్యం అందితే ఫర్లేదు కానీ.. లేదంటే మరణం తప్పదంటున్నారు. ఇంతకూ ఈ వైరస్ ఎలా అంటుతుందన్న విషయంలోకి వెళితే.. జంతువుల శరీరానికి అంటుకొని.. తర్వాత మనుషులకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. నల్లి మాదిరి ఉంటే కీటకాల ద్వారా ఈ వైరస్ మనషుల్ని అంటుకుంటుందని చెబుతున్నారు. కొన్నాళ్ల పాటు చైనాను ప్రపంచం దూరం పెడితే కానీ లెక్క సెట్ కాదేమో?