మూడో వేవ్ ముంచుకొచ్చేసింది. మన ముంగిట్లోకి వచ్చి నిలుచుతుంది. అందుకు తగ్గట్లే తెలంగాణలో కేసులసంఖ్యలో విపరీతమైన మార్పులు కనిపిస్తుంటే.. ఏపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో.. కరోనా లక్షణాలు కనిపించినంతనే.. నిర్దారణ పరీక్ష కోసం ప్రభుత్వం.. ప్రైవేటు కేంద్రాలకు వెళుతున్నారు. కొద్ది రోజులుగాఈ కేంద్రాలు ఖాళీగా ఉంటే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా జనాలుకనిపిస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ కేంద్రాలు మరింత బిజీ కావటం ఖాయం. అనుమానం వచ్చిన ప్రతిసారీ కరోనా నిర్దారణ కోసం వెళ్లటం ఇబ్బందే. ప్రైవేటు కేంద్రాలకువెళితే ఆర్థికంగా భారంగా మారుతున్న పరిస్థితి.
ఇలాంటివేళ.. ఇంట్లోనే కరోనా నిర్దారణ పరీక్ష చేసుకోవటానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. ఈ విధానంలో కిట్ ను కొనుగోలు చేసుకొని.. ఇంట్లోనే పరీక్ష చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అదే జరిగితే.. పరీక్షా కేంద్రాల మీద భారం తగ్గటంతో పాటు.. ఎవరికి వారు పరీక్షలు ఇంట్లోనే చేసుకునే వీలు ఉంది. బహిరంగ మార్కెట్లోకి ఈ కిట్ లు త్వరలోనే రానున్నట్లుచెబుతున్నారు.
వాస్తవానికి యాంటీజెన్ పరీక్షకు రూ.500 పైనే ప్రైవేటు కేంద్రాల్లో వసూలు చేస్తున్నారు. కానీ.. ఈ కిట్లు హోల్ సేల్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.6లకే లభ్యమవుతోంది. అదే మందుల షాపుల్లో మాత్రం రూ.50 నుంచి రూ.100చొప్పున వసూలు చేస్తున్నారు. మార్కెట్లో దొరికే యాంటీజెన్ కిట్ల ద్వారా ఎవరికి వారు తమ పరీక్షను తామే చేసుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో యాంటీజెన్ కిట్ల ద్వారా పరీక్ష చేసే వీలుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అంశం.. శాంపిల్ తీసుకునే సమయంలో కచ్ఛితత్త్వంతో ఉండటం.
ముక్కు లోపల నుంచి నమూనాను తీసుకునే సమయంలో జాగ్రత్తగా తీసి పరీక్షించుకుంటే సరిపోతుంది. ఏ విధంగా శాంపిల్ సేకరించి.. సెల్ఫ్ టెస్టుచేసుకోవాలో ఈ కిట్ లోనే స్పష్టంగా పేర్కొంటారు. ఒకవేళ.. ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చి.. లక్షణాలు మాత్రం కరోనా అన్న అనుమానం ఉంటే మాత్రం.. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి. సో.. చిన్న భయాలకు డబ్బులు పోగొట్టుకోవటం.. బయటకు వెళ్లి కరోనా అనుమానితుల మధ్య నిలవటం కన్నా.. ఇంట్లోనే సెల్ఫ్ చెక్ చేసుకోవటం మంచిదని చెప్పక తప్పదు.