మోడీని ఉక్కిరిబిక్కిరి చేయ‌డంలో మ‌మ‌త త‌ర్వాతే ఎవ‌రైనా!

Update: 2022-02-08 00:30 GMT
బీజేపీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌డంలో ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మిగ‌తా ప్రతిప‌క్ష నేత‌ల కంటే ఎంత ముందుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ధ‌న్క‌ర్ -  మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ధ్య న‌డుస్తున్న వార్ దీనికి నిద‌ర్శ‌నం. ఓ వైపు ఈ వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ త‌రుణంలో ఇప్పుడు మ‌రో వివాదం వార్త‌ల్లోకి ఎక్కింది. సీఎం మ‌మ‌తా వ‌ర్సెస్ కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్న‌ట్లుగాగా ఇప్పుడు తాజా గొడ‌వ తెర‌మీద‌కు వ‌చ్చింది.

మ‌మ‌త ప్ర‌భుత్వంపై  కేంద్ర మంత్రి సింధియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బెంగాల్‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న చేద్దామ‌ని తాము భావిస్తున్నామ‌ని, అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెంగాల్‌లో రెండో విమానాశ్ర‌యం క‌ట్టాల‌ని కేంద్రం భావించింద‌ని, భూమి ఇవ్వ‌డానికి మ‌మ‌త స‌ర్కార్ ఏమాత్రం ముందుకు రావ‌డం లేద‌ని సింధియా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

‘ప్ర‌స్తుతం ఉన్న నేతాజీ విమానాశ్ర‌యం కెపాసిటీ పూర్తైంది. పూర్తి సామ‌ర్థ్యంతో న‌డుస్తున్నా… ఇంకో ఎయిర్‌పోర్ట్ అవ‌స‌రం ఉంది. ఈ విష‌య‌మై నేను ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని క‌ల‌వడానికి గ‌త 6 నెల‌లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాను. అయినా సీఎం మ‌మ‌త స‌మ‌యం ఇవ్వ‌డం లేదు’ అని సింధియా ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మించ‌డానికి తాము సిద్ధ‌మ‌ని, ప్ర‌భుత్వం భూమి ఇవ్వ‌కుంటే ఎలా క‌ట్టాల‌ని సింధియా ప్ర‌శ్నించారు.

అయితే, మ‌మ‌తా ప్ర‌భుత్వం ఈ ఆరోప‌ణ‌ల‌పై ఘాటుగా స్పందించింది. కేంద్ర త‌మ‌ను నిర్దిష్టంగా స‌రైన స‌మాచారం కోసం సంప్ర‌దించ‌డం లేద‌ని ఆరోపిచింది. బెంగాల్‌లో అభివృద్ధి కంటే రాజ‌కీయం చేసేందుకే బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందని టీఎంసీ నేత‌లు మండిప‌డ్డారు. బెంగాల్ పురోగామి కోసం టీఎంసీ ఎల్ల‌వేళ‌లా పాటుప‌డుతుంద‌ని తెలిపింది.


Tags:    

Similar News