18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. !

Update: 2021-11-11 11:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ బిష్వభూషణ్‌ నోటిఫికేషన్ జారీ చేశారు. 4,5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. పలు కీలక పద్దులను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉండగా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రధాన ప్రతిపక్షం కాచుకుని కూర్చున్నది. అనంతపురంలో విద్యార్థుల ఆందోళనతోపాటు పలు అంశాలను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది.

కాగా, తన ఒడిశా పర్యటనలో భాగంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో జరిపిన చర్చల సారాంశాన్ని సభకు తెలిపి పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. తొలి రోజున నిర్వహించే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు కానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏపీ ప్రత్యేక హోదాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో రెండు సార్లు శీతాకాల సమావేశాల నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News