ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీ బీజేపీ నేతల్ని తిట్టేస్తూ.. వారిని శాపనార్థాలు పెడుతున్న పోస్టర్ రాజకీయ కలకలాన్ని రేపుతోంది. కాట్రగడ్డ బాబు పేరుతో వెలిసిన ఈ పోస్టర్ లో బీజేపీకి తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపిందని.. బీజేపీ బిడ్డ గొంతును నలుముతోందని రాశారు. అంతేకాదు..కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిన తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీకి బీజేపీ బోలెడంత అన్యాయం చేసిందన్న మాట ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయిన వేళ.. ఈ పోస్టర్ లోని విషయాలు మరింత మంట పుట్టేలా ఉండటం.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేయటంతో పాటు.. బీజేపీకి ఏపీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్న సందేశం వైరల్ అవుతోంది.
సహజంగానే ఈ పోస్టర్ దెబ్బకు ఏపీ బీజేపీ నేతల్లో మరింత గుబులుగా పెరిగింది. అధినాయకత్వానికి వినయ విధేయలతో లేకుండా పార్టీలో మనగలగటం కష్టం. దీంతో.. సొంత ప్రజలకు అన్యాయం చేస్తూ.. వారికేదో మంచి జరిగిందన్నట్లుగా మాట్లాడుతున్న కమలనాథులు లోలోన మాత్రం తాము చేస్తున్న తప్పులకు.. తమ రాజకీయ ఉనికి ఏమిటన్న భయాందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరికొందరు బీజేపీ నేతలు మాత్రం ఏపీకి ఎలాంటి అన్యాయం జరగలేదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందన్న మాట అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కొందరు బీజేపీ నేతలు నడుం బిగించారు.ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ నేత రఘురాం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ.. టీడీపీ తమ ప్రభుత్వంలో లేకున్నా.. ఇప్పటికి తమ మిత్రపక్షమేనని స్పష్టం చేయటం గమనార్హం. మంత్రుల్ని ఉపసంహరించుకున్నప్పటికీ ఏన్డీయేలో భాగస్వామ్య పక్షంగాఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
ఏన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న వారు బయటకు వెళ్లిపోయినా..కొత్తవాళ్లు వచ్చినా తమకు సంతోషమేనని.. దేశ అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ఆయన చెబుతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయం గురించి ప్రధాని మోడీకి తెలుసన్నారు.