ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి తనకు వద్దని నిర్మోహమాటంగా చెప్పిన ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే మరోసారి చాన్స్ ఇచ్చారు. ఇక ఈ టీటీడీ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్న ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లాడు.
తనకు ప్రజాసేవా చేయాలని ఉందని.. ప్రజల్లో ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ కిక్కే వేరు అంటూ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ కోసం జగన్ ను అడుగుతానని చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా నామినేటెడ్ పదవుల్లో మరోసారి వైవీ సుబ్బారెడ్డికి ఇష్టం లేకున్నా జగన్ ‘అదే టీటీడీ చైర్మన్’ పదవిని కట్టబెట్టేశాడు.
తాజాగా నామినేటెడ్ పదవులను జగన్ ప్రకటించారు.అందులో 56శాతం బీసీలకు, 50శాతం మహిళలకు అవకాశం ఇచ్చారు. రెండోసారి టీటీడీ చైర్మన్ గా వైవీకే అవకాశం ఇచ్చారు.
ఇక జోడు పదవుల విధానానికి స్వస్తి పలికి.. ఒకరికి ఒక్క పదవి మాత్మే కేటాయించారు. మొత్తం 135 పోస్టులకు గాను 56శాతం బీసీలకు, 50శాతం అందులో మహిళలకు అవకాశం ఇచ్చారు.
ఇక నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు జగన్ షాక్ ఇచ్చాడు.ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా కార్పొరేషన్, చైర్మన్ పదవులు ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు చేశారు.
గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారికి మొదట ప్రాధాన్యతను ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి రెండో ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడివారిని ఈ నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేశారు. అత్యధికంగా 11 మంది విశాఖ ప్రాంత నేతలకు పోస్టులు కట్టబెట్టారు.