ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండడం.. ఆ వైరస్ కట్టడి చర్యలతో పాటు లాక్‌డౌన్ అమలుతో పరిపాలన వ్యవహారాలు, వ్యవసాయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అవసరమైన కీలక రంగాలపై సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అధికారులతో సమావేశమై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే రైతులు నష్టపోకుండా వెంటనే పోగాకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. పొగాకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్ల కు చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మాట్లాడిన విషయాలు చర్చకు వచ్చాయి.
దీంతో గుజరాత్ లో చిక్కుకు పోయిన తెలుగు మత్య్సకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించడంపై తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కరోనా నివారణ చర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ తో మాట్లాడినట్టు సీఎం జగన్ తెలిపారు. సీనియర్ అధికారి సతీశ్ చంద్ర సమన్వయం కుదిర్చి.. తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో కోలుకుని డిశ్చార్జైన వారికి రూ. 2 వేల ఆర్థిక సహాయం అందించే పనులు ముమ్మరం చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 231 మంది ఆ మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు చేరగా వారిలో కొంత మందికి సహాయం చేశారని, మిగిలిన వారికి అందించాలని ఆదేశించారు. వీటితో పాటు చాలా అంశాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా కరోనా నివారణపై చర్చలు చేశారు.