రింగ్ దాటితే కఠిన చర్యలు తప్పవు .. టీడీపీ నేతలకి సీఎం వార్నింగ్ !

Update: 2020-01-22 06:51 GMT
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజూ హాట్ హాట్‌ గా సాగుతున్నాయి. మూడో రోజు కూడా టీడీపీ నేతల నినాదాలతో సభ హోరెత్తిపోతుంది. జై అమరావతి నినాదాలతో సభని ముందుకు జరగనీయకుండా టీడీపీ నేతలు అడ్డుతగులుతున్నారు. ఇక ఈ రోజు సభ ప్రారంభం కాగానే రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరుగుతుండగా.. ప్రతిపక్ష టీడీపీ కి చెందిన నేతలు ‘జై అమరావతి’ అంటూ స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకున్నారు. వారికీ స్పీకర్ ఎంతచెప్పినా వినకుండా స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూనే ఉన్నారు.

ఇక ఇదే సమయంలో సభలోకి అడుగు పెట్టిన సీఎం జగన్ ని చుసిన టీడీపీ నేతలు జై అమరావతి నినాదాన్ని పక్కన పెట్టి ..‘ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి.. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్రస్థాయిలో మండిపడ్డ స్పీకర్.. టీడీపీ సభ్యులను పోయి కూర్చోండి అంటూ సీరియస్ అయ్యారు. అయినా ప్రతిపక్ష సభ్యులు పట్టువదలకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ ఎంత చెప్తున్నప్పటికీ కూడా వినకుండా స్పీకర్ పొడియం చుట్టు ముట్టడం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో కనీసం పట్టుమని 10 మంది సభ్యులు లేరుకానీ... చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. మేం 151మంది ఉన్నా ఎంతో ఓపికా ఉన్నామన్నారు. వైసీపీ సభ్యుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు జగన్. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు అగౌరవపరుస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులు రౌడీల్లాగా  వ్యవహరిస్తున్నారన్నారు. వీళ్ల కంటే వీధి రౌడీలు చాల బెటర్‌ అని, స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి దాడి చేస్తే, ఆ ఘటన ను రాజకీయం చేసి లబ్ధిపొందే దిక్కు మాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో చేతకాక పోతే అసెంబ్లీ కి రావొద్దన్నారు. ఎవరైనా పోడియం వద్దకు వస్తే, మార్షల్స్‌తోబయటకు ఈడ్చేస్తామన్నారు. పోడియం వద్ద మార్షల్స్‌ను పిలిపించి ఉంచాలన్నారు. ఎవరైనా రింగ్ దాటి లోపలికి వస్తే.. వెంటనే బయట కు పంపించేయండని స్పీకర్‌కు తెలిపారు సీఎం జగన్.
Tags:    

Similar News