ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. వారం పని చేస్తే రెండువారాలు సెలవులు

Update: 2020-04-08 05:00 GMT
ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని రీతిలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా మారిందని చెప్పాలి. కరోనా కేసుల్ని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మిస్ కాకుండా అమలు చేస్తున్న ఆయన.. తీవ్ర ఒత్తిడి మధ్య పని చేసే వైద్యులు.. వైద్య సిబ్బందికి భారీ తీపి కబురును తీసుకొచ్చింది. కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ.. తీవ్ర ప్రతికూలత మధ్య పని చేసే వారి క్షేమం విషయంలో తాము పెద్దపీట వేస్తామన్న విషయాన్ని తన తాజా నిర్ణయంతో స్పష్టం చేసినట్లుగా భావిస్తున్నారు.

తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు.. వైద్య  సిబ్బంది వారం పాటు డ్యూటీ చేస్తే.. వారికి రెండు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచన చేశారు. దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధంగా ఉందని.. అధికారికంగా ప్రకటించటమే ఆలస్యమని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు కోవిడ్ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు.. మరికొద్ది రోజుల్లో ఏపీలోని 13 జిల్లాల్లో 13 ఆసుపత్రుల్ని సిద్ధం చేయనున్నారు.

ఈ మొత్తం ఆసుపత్రుల్లో 650 ఐసీయూ బెడ్లు.. 8950 నాన్ ఐసీయూ బెడ్లను రెఢీ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బందికి తగిన గుర్తింపును ఇవ్వటమే కాదు.. వారి సేవలకు ప్రతిఫలమన్నట్లుగా సీఎం జగన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించిన తర్వాత.. వివిద రాష్ట్రాల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
Tags:    

Similar News