ఈ మహమ్మారి కట్టడికి ఈనెల16వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని పురాతన ఆలయాల్లో యాగం, హోమం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య భారత యఙ్ఞం పేరుతో 20 పురాతన ఆలయాల్లో యాగం, హోమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు పంచారం ప్రకారం ఒకే రోజు అశ్వినీ నక్షత్రం, మంగళవారం కలిసి వచ్చినందున ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
యాగం, హోమం చేసే దేవాలయాల లిస్ట్‌లో శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ, ప్రొద్దుటూరు అగస్తీశ్వర ఆలయం, సింహాచలం, అహోబిలం, అంతర్వేది, మంగళగిరి, రామతీర్థం, అన్నవరం, ద్వారకాతిరుమల, కాణిపాకం, కసాపురం, విజయవాడ దుర్గగుడి, అరసవెల్లి, శ్రీశైలం శక్తిపీఠం, పిఠాపురం శక్తిపీఠం, ద్రాక్షారామం, జొన్నవాడ, త్రిపురాంతకం ఉన్నాయి. కాగా కరోనా పోవాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల యోగాలు, హోమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.