ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన.. కార్పొరేషన్లు.. ఇప్పుడు ఆయనకే సెగ పెడుతున్నాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన.. జగన్ చాలా మంది పదవులు పందేరం చేశారు. అయితే.. వీరికి నిధులు లేవు., పనులు కూడా లేవు. దీని పై కొన్నాళ్లుగా వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచుగా వీరి వ్యవహారం చర్చకు కూడా వస్తోంది. తాజాగా లిడ్ క్యాప్ చైర్మన్.. ఈ విషయంలో ప్రభుత్వం పై భగ్గుమన్నారు. "రాష్ట్రంలో కార్పొరేషన్ ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని అధికారులు చెబుతున్నా"రంటూ లిడ్క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు.
అధికారులెవవరూ ఛైర్మన్లను లెక్క చేయటం లేదని అన్నారు. ఉత్సవ విగ్రహాలుగా, ఏసీ రూముల్లో కూర్చునేందుకు తాము రాలేదని.., ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే వచ్చామన్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్ ఛైర్మన్ల పరిస్ధితి పై లిడ్క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాకళాక్షేత్రంలో ప్రభుత్వం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అధికారులెవవరూ ఛైర్మన్లను లెక్క చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్సవ విగ్రహాలుగా, ఏసీ రూముల్లో కూర్చునేందుకు తాము రాలేదని అన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే వచ్చామన్నారు. రాజ్యంగం కల్పించిన ఫలాలు దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందటం లేదన్నారు. పేదవారి కోసం అవసరమైతే చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు.
లిడ్క్యాప్లో రూ.కోటి టర్నోవర్ ఉన్న వారికే కాంట్రాక్టు పనులు చేసేందుకు అవకాశం ఉందని.., దీని వల్ల బోర్డులో ఒక్క దళితుడికీ అవకాశం లేని పరిస్ధితి ఉందన్నారు. బోర్డులో దళితులను నియమించాలని తాను పట్టుబట్టడంతోనే దళితులను నియమించారని చెప్పారు. కొందరు ఉన్నతాధికారులు ఛైర్మన్లకు సహకరించటం లేదని.., ఇకపై అలాంటి అధికారుల ఆటలు సాగవని హెచ్చరించారు. చట్టాలని అడ్డుపెట్టుకుని ఎవరికైనా అన్యాయం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
"కార్పొరేషన్ ఛైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని చెప్తున్నారు. ఛైర్మన్లను అధికారులెవరూ లెక్కచేయడం లేదు. ఉత్సవ విగ్రహాలుగా, ఏసీ రూముల్లో కూర్చునేందుకు మేం రాలేదు. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకే వచ్చాం. మా హక్కులు, అధికారాలను వినియోగించుకుంటాం. కొందరు అధికారులు ఛైర్మన్లకు సహకరించడం లేదు.
ఇక పై అలాంటి అధికారుల ఆటలు సాగవు" అని హెచ్చరించారు. అయితే.. ఇదే పరిస్థితి మిగిలిన కార్పొరేషన్లలోనూ ఉంది. అయితే.. కొందరు మాత్రమే బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు.. వీరు కూడా బయటపడడం ఖాయం. దీంతో జగన్ కు ఇబ్బందేననే వాదన బాహాటంగానే వినిపిస్తుండడం గమనార్హం.