ప్రముఖులు పలువురు కొన్నిసార్లు ముఖానికి రంగేసుకోవటం తెలిసిందే. తాజాగా ఆ బాటలోనే నడిచారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పాముల పుష్ఫశ్రీవాణి. ఏపీ గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వీలుగా ముఖానికి రంగేసుకొని.. షూటింగ్ లో పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యతను తెలిపేలా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రకృతి’. దీనికి సంబంధించిన షూటింగ్ ను తాజాగా విజయనగరం పట్టణంలోని లోవ ముఠా ప్రాంతంలో జరిగింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా.. దాని ప్రాముఖ్యతను తెలియజేసేలా సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఉపాధ్యాయురాలి పాత్రను పోషిస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరిపిన షూటింగ్ లో ఆమె టీచర్ గా నటించిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఇదే చిత్రంలో జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ రీల్ లోనూ అధికారి పాత్రను పోషించారు. మరీ చిత్రం ఎలా ఉంటుందో జనం ముందుకు వస్తే కానీ తెలీదు.