ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి ఏదైనా సదస్సుకు వెళ్లి ఇష్టారాజ్యంగా వ్యవహరించినా.. రచ్చరచ్చ చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేసినా.. అది కానీ శ్రుతిమిస్తే దాని వల్ల జరిగే నష్టం.. ఎంత ఉంటుందో తెలీనంత పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే ఉండే అవకాశమే లేదు. ఎంత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నా మాత్రం.. బాధ్యతను మర్చిపోయి వ్యవహరించిన ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువనే చెప్పాలి.
అలాంటిది.. ఒక మహిళా ఎమ్మెల్యే విషయంలో ఏపీ పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు వివాదంగా మారింది. ఏపీ రాజధాని అమరావతిలోజరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఏపీ జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. ఆపై గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లిన వైనంపై ఏపీ పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అంటూ..జగన్ పార్టీ నేతలు పలువురు ఏపీ డీజీపీ సాంబశివరాను కలిశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. పలు సందేహాలు కలిగేలా చేశాయని చెప్పాలి. ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న సదస్సును ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉందన్న మాటను ఆయన చెప్పారు. వేదిక వద్ద ఆందోళన చేసేందుకు వీలుగా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగావెల్లడించారు.
ఈ అంశంపై తమకు పక్కా సమాచారం ఉందన్న ఏపీ డీజీపీ.. తమకుఎవరి మీద ప్రత్యేక ఆసక్తి ఉండదని స్పష్టం చేశారు. సదస్సు చక్కగా జరగాలన్నదే తమ ఆలోచన తప్పించి మరింకేమీ తాము ప్రాధాన్యత ఇవ్వమని చెప్పిన ఏపీ డీజీపీ.. సదస్సు దగ్గర ఎలాంటి ఆందోళన చేపట్టమని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పక్షంలో అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ డీజీపీ మాటల్లోనే నిజం ఉందని అనుకుందాం. వేదిక వద్ద నిరసన తెలపాలన్నదే రోజా ప్లాన్ అయితే.. అందరి ముందే ఆమె ప్లాన్ అమలు చేసేసమయంలో పోలీసులు తెలివిగా భగ్నం చేసి ఉంటే బాగుండేది కానీ.. ఎయిర్ పోర్ట్ లోకి వస్తున్న ఒంటరి వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిప్పి పింపిన వైనాన్ని పలువురు తప్పు పడుతుండటం గమనార్హం.