విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎంత అన్యాయం జరిగిందో.. రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత దయనీయ స్థితికి చేరుకుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగులకు జీతాలివ్వడానికి - సంక్షేమ పథకాలకు కూడా డబ్బుల్లేవని ప్రభుత్వ పెద్దలే చెబుతుంటారు. ఐతే ఈ కష్టాలు ఇలా ఉన్నప్పటికీ జాతీయ సగటును మించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు సాధించడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 9.72 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ కాలంలో దేశ వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే కావడం విశేషం. పార్టీ తరఫున అధికారిక ప్రకటన చేశారంటే ఈ లెక్కలు వాస్తవమనే భావించాలి. ఈ గణాంకాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేవే. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో వృద్ధి రేటు సాధించడమంటే చిన్న విషయం కాదు.
వ్యవసాయంలో 12.52 శాతం - పారిశ్రామిక రంగంలో 7.19 శాతం - సేవా రంగంలో 10.15 శాతం. పశు సంవర్ధకంలో 11.29 శాతం - మత్స్య రంగంలో 11.24 శాతం వృద్ధి రేటు నమోదవడం విశేషం. వరుసగా ప్రతికూల విషయాలతోనే వార్తల్లో ఉంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ గణాంకాలు మంచి మైలేజి ఇస్తాయనడంలో సందేహం లేదు.