వ్యాక్సినేషన్ పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ !

Update: 2020-12-21 15:01 GMT
ఏపీలో కరోనా మహమ్మారి జోరు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తుంది. గతంలో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే అతి త్వరలో దేశంలో కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. ఈ తరుణంలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అర్బన్ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్ ‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌ గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఉత్తర్వుల్లో సవరణలు చేసింది.స్టేట్ టాస్క్ ఫోర్స్‌లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యులుగా 34 మందిని నియమిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:    

Similar News