కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెజవాడ స్వర్ణ ప్యాలెస్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించటంతో పాటు.. పలువురు గాయపడటం తెలిసిందే. ఈ ఉదంతాన్ని ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకుంది. అదే సమయంలో బాధితులకు భారీ పరిహారాన్ని ప్రకటించటంతో పాటు.. గాయపడిన వారికి వైద్యసాయాన్ని చేపట్టింది.
అదే సమయంలో.. నిర్లక్ష్యంతో వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేయకుండా వ్యవహరిస్తోంది. ఈ ఘటనకు నిర్లక్ష్యం.. అలక్ష్యం కారణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్ యాక్సిడెంట్ కు కారణమైన రమేశ్ ఆసుపత్రుల ఎండీపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై రమేశ్ ఆసుపత్రి ఎండీతో పాటు.. ఆసుపత్రి ఛైర్మన్ లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై చర్యలు తీసుకోవద్దని కోరారు. వీరి చేసుకున్న వినతిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. అంతేకాదు.. కరోనా కేర్ సెంటర్ కు అనుమతి ఇచ్చిన అధికారుల్ని హైకోర్టు తప్పు పట్టింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సర్కారు భిన్నంగా స్పందించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఒక ప్రమాద ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లుగా కనిపిస్తున్న వేళ.. వారిపై చర్యల విషయంలో సుప్రీం నిర్ణయాన్ని పాటించాలని ఏపీ రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్లుగా చెప్పాలి. మరి.. దీనిపై సుప్రీంకోర్టు ఎలా రియాక్టు అవుతుందన్నది చూడాల్సిందే.