ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు గ్రామాల్లోనే వారికి సమీపంలోనే ప్రభుత్వసేవలు అందించడానికి అంటూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. అలాగే పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో పనిచేయడానికి అంటూ 1.34 లక్షల ఉద్యోగాల భర్తీకి నియామక పరీక్ష జరిపి వారిని ఉద్యోగాల్లో నియమించింది. అయితే.. వాస్తవానికి 1.17 లక్షల మందిని మాత్రమే ఉద్యోగాల్లో నియమించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మిగతా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయని అంటున్నారు. కానీ జగన్ ప్రభుత్వం సందర్భం వచ్చిన ప్రతిసారీ 1.34 లక్షల ఉద్యోగాలను నియమించామని చెబుతూ వస్తోంది.
అయితే వీరిని ఇప్పటివరకు పర్మినెంట్ చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారికి వేతనాలు పెంచాల్సి ఉంది. అయితే ఇంతవరకు పర్మినెంట్ చేయకుండా ఆ ఉద్యోగులను ప్రొబేషన్ లోనే ఉంచింది. మొత్తం 1.17 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వివిధ నిబంధనలను చూపి 56 వేల మందిని మాత్రమే పర్మినెంట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. పలు కారణాలు చూపి 60 వేల మంది ఉద్యోగులను పక్కన పెట్టినట్టు సమాచారం. దీంతో వీరంతా తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. తాము ప్రభుత్వ నియామక పరీక్ష రాసి ఉద్యోగం సాధించినా.. ప్రొబేషన్ పేరుతో రూ.15 వేల తక్కువ జీతానికే తమతో పనిచేయించుకున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
గతంలో పీఆర్సీ, వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు నిరసనకు దిగినప్పుడు వారితోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు వీరికి కూడా భరోసా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారిని జూన్ లో పర్మినెంట్ చేస్తామని చెప్పింది. అయితే డిపార్టమెంట్ టెస్టులో పాసయితేనే పర్మినెంట్ అని మెలికపెట్టింది.
డిపార్టుమెంట్ టెస్టు కూడా కొద్దిమందికే నిర్వహించింది. వాటి ఫలితాలను ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందికి ఇప్పటివరకు డిపార్టుమెంట్ టెస్టు నిర్వహించలేదు. 14 వేల మంది మహిళా పోలీసులకు ఏడాది క్రితం డిపార్టుమెంట్ టెస్టు నిర్వహించినా ఇంతవరకు ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వారందరికీ పర్మినెంటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
అలాగే 15 రోజుల కంటే ఎక్కువ క్యాజువల్ లీవులు వాడుకున్న కార్యదర్శులకు, షోకాజు నోటీసులు అందుకున్నవారికి, మెటర్నటీ లీవులో ఉన్న సిబ్బందికి, అనారోగ్యంతో సెలవులో ఉన్నవారిని పర్మినెంట్ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే కొంతమంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన టార్గెట్లు పూర్తి చేయలేదని వారిని కూడా పర్మినెంట్ చేయడం లేదని అంటున్నారు.
అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం ఎల్లో మీడియాపై మండిపడంది. జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషన్ ఖరారు చేసి జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనవరిలోనే ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటున్నారు. డిపార్టుమెంటల్ పరీక్షలు పాసయిన 80 వేల మంది ఉద్యోగుల వివరాలను అధికారులు తెప్పించుకుంటున్నారని వివరిస్తున్నారు. త్వరలోనే మరో 14 వేల మహిళా పోలీసుల డిపార్టుమెంటల్ టెస్టు ఫలితాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.