రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులుగా ఏపీలో సీన్ ఉంది. తమకు పాత జీతాలనే చెల్లించాలని ఉద్యోగులు ఒక వైపు డిమాండ్ చేస్తున్నారు. తమకు కొత్త పీయార్సీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా అంటున్నారు. తమకు భారీ ఎత్తున ఆర్ధికంగా నష్టం చేకూర్చే కొత్త పీయార్సీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు కొత్త పీయార్సీ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసుకోవాలని కూడా కోరుతున్నాయి.
మరో వైపు చూస్తే ప్రభుత్వం ఎక్కడా తగ్గేది లేదు అంటోంది. కొత్త పీయార్సీ మేరకే జీతాలు అని చెబుతోంది. ఈ విషయంలో కొత్త పీయార్సీ ప్రకారం జీతాలు చెల్లించేలా ఉద్యోగులకు బిల్లులు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2018 జూలై 1 నుంచి 2021 డిసెంబర్ 31 దాకా సర్వీసుని తీసుకుని కొత్త సాఫ్ట్ వేర్ మాడ్యూల్ లో బిల్లులు అప్ లోడ్ చేయాలని సూచించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కొత్త పే స్లిప్స్ రెడీ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే డీడీఓలకు కొత్త పే రివిజన్ రోల్స్ అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశాలు వెళ్లాయి. అవి కూడా ఈ నెల 25వ తేదీలోగా సిద్ధం చేయమని గడువు కూడా విధించారు.
అయితే ట్రజరీ ఉద్యోగులు మాత్రం తాము కొత్త పీయార్సీ మీద బిల్లులను ప్రాసెస్ చేయమని తెగేసి చెబుతున్నాయి. తాము కూడా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించాయి. ఇంకో వైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 24న సమ్మె నోటీస్ ని సీఎస్ కి ఇవ్వనున్నాయి. ఆ మీదట వరస ఆందోళనలు చేపట్టి ఫిబ్రవరి 7 నుంచి పూర్తి స్థాయిలో సమ్మె బాట పట్టనున్నాయి.
మరి ప్రభుత్వం ఎలాగైనా కొత్త పీయార్సీ మీదనే ఉద్యోగులకు ఫిబ్రవరి నెలకు జీతాలు ఇవ్వాలని భావిస్తోంది. అదే విధంగా బిల్లులను ప్రాసెస్ చేయాలని కూడా కోరుతోంది. ఇందుకోసం అన్ని రకాలుగా చూడాలని ఉన్నతాధికారులను కూడా నియమించారు. ఇక సర్కార్ వైఖరి చూస్తే గట్టిగానే ప్రభుత్వం ఉంది. ఈ రకంగా అటూ ఇటూ పట్టుదలగా ఉన్న నేపధ్యంలో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.
మరి ఉద్యోగులకు ఈ నెల 25న నాటికి కొత్త పీయార్సీ పే బిల్ల్స్ తో ప్రాసెస్ చేయకపోతే ఫిబ్రవరి ఫస్ట్ నాటికి జీతాలు వస్తాయా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ఎవరు వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. ఇది ఎంత వరకూ సాగుతుందో చూడాలి.