బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధికి గ‌వ‌ర్న‌ర్‌..

Update: 2019-10-01 09:55 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్  గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్‌  హరిచందన్‌ దంపతులు నేడు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. ఈవో సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ద‌స‌రా న‌వ‌రాత్రోత్స‌వాల్లో భాగంగా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో శ‌ర‌న్న‌వరాత్రి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. గ‌త మూడు రోజులుగా అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న ఉత్స‌వాల సంద‌ర్భంగా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు.   అయితే ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

మూడో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. బిశ్వ‌భూషణ్ హరిచందన్ గవర్నర్ దంప‌తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి,రాష్ట్ర ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలు ద‌స‌రా ఉత్స‌వాలను ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని - ప్ర‌జ‌లంతా ఎలాంటి ఆటంకాలు క‌లుగ‌కుండా సంతోషంగా పండుగ‌ను నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు  దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఎంతో మ‌హిమానివ్వ‌త‌మైన‌ - మ‌హిమ‌ గ‌ల‌ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని గ‌వ‌ర్న‌ర్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఏపీ  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ద‌స‌రా  ఉత్సవ ఏర్పాట్లు అధికారులు బాగా చేశార‌ని, అధికారులు చేసిన ఏర్పాట్లు  భేష్ అంటూ అధికారుల‌ను మెచ్చుకున్నారు.  రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా దుర్గమ్మ ఆలయం నిలుస్తుందని -  నవరాత్రులు సందర్భంగా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని గ‌వ‌ర్న‌ర్ అన్నరు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌ను ఆలయ సంప్ర‌దాయాల ప్ర‌కారం ఘ‌నంగా స‌న్మానించారు.



Tags:    

Similar News