మూడేళ్ల కిందట కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి కేసు విషయంలో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని ప్రయోజనం పొందాలనుకున్న జనసేన పార్టీకి ఝలక్ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు కర్నూల్ జిల్లా ఎస్పీ ప్రకటించారు. సుగాలి ప్రీతి కేసును ఇదివరకే సీబీఐకి అప్పగించినట్లు కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు వెల్లడించారు.
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కేసు విషయమై బుధవారం ర్యాలీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కర్నూల్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు మంగళవారం ఎస్పీ ఈ ప్రకటన చేయడం అనుమానాలకు దారితీస్తోంది. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు నిరసన ప్రదర్శనలు చేయడానికి సిద్ధమైన సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
కర్నూలు లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతుండేది. 2017 ఆగస్టు 19వ తేదీన విద్యార్థిని దారుణ పరిస్థితిలో చనిపోయింది. ఈ రెసిడెన్షియల్ పాఠశాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదివరకే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుగాలి ప్రీతి కుటుంబీకులు డిమాండ్ చేసినప్పటికీ.. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదు.
పాఠశాల తమ పార్టీకి చెందిన నాయకుడిదే కావడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తునకు అంగీకరించలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం మారడంతో ఈసారైన ప్రీతి కేసులో న్యాయం జరుగుతుందనే ఆశ అందరిలో రేకెత్తింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్ ఎగుస్తోంది. ఈ సుగాలి ప్రీతి కుటుంబీకులకు పవన్ కల్యాణ్ అండగా ఉన్నారు. ప్రస్తుతం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని బుధవారం జనసేన భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఎస్పీ ప్రకటన చేయడం విశేషం.
అంటే మేం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని పరోక్షంగా జనసేనకు ప్రకటించినట్లు తెలుస్తోంది. మేం చేశాం.. ఇక మీరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పినట్లు ఈ పరిణామం ఉంది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో ఇక పవన్ కల్యాణ్ ఏ విషయం మాట్లాడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రశ్నించడానికి ముందుకు రాని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎలా వస్తారని, ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.