టికెట్ రేట్లు.. ఎమ్మార్వోలపై చర్యలకు ఆదేశం?

Update: 2021-08-16 16:30 GMT
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచేలా కనిపిస్తోంది. సినిమా టికెట్ రేట్ల వ్యవహారం సీరియస్ టర్న్ తీసుకునేలా కనిపిస్తోంది.

ప్రభుత్వాన్ని ఓ పక్క సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అడుగుతూ.. చర్చలకు వస్తామని చెబుతూ మరో పక్క సైలెంట్ గా పాత రేట్లకు అమ్మేస్తున్నారని థియేటర్ యజమానులపై ఓ అపవాదు ఉంది.  లోకల్ అధికారులను మేనేజ్ చేస్తూ జనాలకు కొత్త తగ్గింపు రేట్లు తెలియకుండా చాలా థియేటర్ల దగ్గర ఇలాచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సి సెంటర్లలో ఇలాంటి వ్యవహారం ఎక్కువగా ఉందని.. నగర పంచాయతీలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మార్వోలను కట్టడి చేయాలని జాయింట్ కలెక్టర్లకు సీఎం పేషీ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.  అవసరం అయితే ఎక్కడ ప్రభుత్వ జీవో ఉల్లంఘించి పాత రేట్లు అమ్మేస్తున్నారో అక్కడి లోకల్ అధికారుల్లో బాధ్యులను గుర్తించి  చర్యలు తీసుకోమని తాజాగా ఏపీ సీఎం పేషీ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

గత రెండు వారాల్లో విడుదలైన చిన్న సినిమాల విషయంలో ఇలా చేయడం కామన్ అయిపోయింది. సిండికేట్ చేసి థియేటర్లు చేతిలో ఉంచుకున్న కొంతమంది సైలంట్ గా ఈ వ్యవహారానికి తెరతీశారని సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దీంతో కింది స్థాయి అధికారులను దీనికి బాధ్యులను చేసేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News