తనను గెలిపించిన ప్రజలకు సీఎం జగన్ మరో వరమిచ్చారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని కేటాయించారు. పులివెందుల ఏపీ కార్ల్ లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఏపీ కార్ల్ సీఈవో డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఈ కంపెనీ పశువులకు సంబంధించిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారీ చేస్తుంది. గొర్రెలు, గేదెలు, ఆవులు, మేకలకు సంబంధించిన వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాక్సిన్ తయారీ యూనిట్ కు ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
కాగా వ్యాక్సిన్ తయారీ యూనిట్ కు ఏపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. ఈ కంపెనీ ద్వారా 100 మంది నిపుణులకు, సిబ్బందికి ఉపాధి లభించనుంది.
ఏపీ ప్రభుత్వం అవసరాలు తీరిన తర్వాత ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.