నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి చాలా స్పీడుగానే వెళుతున్నారు. ఇప్పటికే చాలా హామీలను అమల్లో పెట్టేసిన జగన్... ఇప్పుడు మరో హామీని ఆయన పట్టాలెక్కిస్తున్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా సొంతంగా ఆటో కొనుగోలు చేసుకుని నడుపుతున్న డ్రైవర్లకు ఆసరాగా నిలిచే ఉద్దేశంతో ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి రూ.10 వేలను అందిస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్... ఇప్పుడు ఈ హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ వాహన మిత్ర పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించనున్న జగన్... ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు ఏడాదికి రూ.10 వేలను ఉచితంగా అందజేయనున్నారు. ఈ పధకాన్ని వచ్చే నెల 4న లాంఛనంగా ప్రారంభించనున్నట్లుగా జగన్ సర్కారు శుక్రవారం ప్రకటించింది.
ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించిన జగన్... రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపన దిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా హామీలను అమలులోకి తెచ్చేసిన జగన్.... మిగిలిన హామీలను కూడా అమల్లోకి తెచ్చే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ వాహన మిత్రను ప్రకటించిన జగన్ సర్కారు.... ఇదివరకే ఈ పథకం కింద లబ్దిదారులకు ఉండాల్సిన అర్హతలకు సంబంధించి ప్రకటన చేసింది. ఈ ప్రకటనకు లబ్దిదారుల నుంచి భారీ స్పందన వచ్చిందనే చెప్పాలి. ఇప్పటిదాకా ఈ పథకం కోసం మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందాయి. వీటిలో నేటి వరకు 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న జగన్ చేతుల మీదుగా వైఎస్సార్ వాహన మిత్ర పథకంను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పథకం కింద లబ్దిదారులుగా అర్హత పొందాలంటే ఏం చేయాలన్న విషయానికి వస్తే... ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లు 'వాహన మిత్ర' పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్ కార్డు - తెల్ల రేషన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ - డ్రైవింగ్ లైసెన్స్ - రుణం లేని బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ - సంబంధిత అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ - బీసీ - మైనార్టీలైతే తమ కులధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఇలా సమర్పించిన ఆ డాక్యుమెంట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సంరక్షణలో ఉందో లేదో పరిశీలిస్తారు. ఈ సమాచారాన్ని, సదరు దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్, బిల్లు కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారన్నారు. తర్వాత ఆ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.