వైఎస్ఆర్ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు

Update: 2020-08-31 17:31 GMT
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టడంపై టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను తాజాగా విచారించిన హైకోర్టు సదురు వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై వైఎస్ఆర్ ఫొటో పెడితే తప్పేంటని హైకోర్టు పిటీషన్ ను ప్రశ్నించింది. సీఎం వైఎస్ జగన్ తండ్రి వైఎస్ఆర్ అని.. పైగా గతంలో రాష్ట్రానికి సీఎంగా పనిచేశారని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించబోమని.. రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని పిటీషనర్ కు హితవు పలికింది.

ఈ పిటీషనర్ పై ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని.. చంద్రబాబు దగ్గరి మనిషి అని.. రాజకీయ కక్షతోనే ఈ పిటీషన్ వేశాడని వాదించారు.

దీంతో మంత్రులు, ఇతర వ్యక్తుల ఫొటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందని.. వైఎస్ఆర్ ఫొటో పెట్టడంలో తప్పు లేదని హైకోర్టు తీర్పునిచ్చింది.
Tags:    

Similar News