సీబీఐపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో పంచ్ ప్రభాకర్‌ను పట్టుకోలేరా? అని నిలదీసింది. ఈ విషయంలో జనవరి 25లోపు పూర్తిస్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడం ఏంటని.. దీనిని తక్కువ చేసి చూస్తారా? అని హైకోర్టు సీరియస్ అయింది. మన వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఫైర్ అయింది.
పంచ్ ప్రభాకర్‌కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ పేర్కొనడం పట్ల హైకోర్టు తరపు న్యాయవాది అశ్వినీ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బందువులు ఎవరూ, ఆయన ఆస్తులు గురించి సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని అశ్వినీ కుమార్ ప్రశ్నించారు. నిందితుల పరస్పర అప్పగింతలో భాగంగా సీబీఐ ఎందుకు పనిచేయలేకపోతుందని ప్రశ్నించారు. సీబీఐ వేసిన అఫిడవిట్‌లో ఎటువంటి కొత్త విషయాలు లేవని, అందరికి తెలిసిన విషయాలే అందులో ఉన్నాయని అశ్వినీ కుమార్ పేర్కొన్నా రు. గుగుల్‌లోకి వెళితే ఈ విషయాలు అందరికీ తెలుస్తాయన్నారు. తమకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలు సమాచారం ఇవ్వడంలేదని ధర్మాసనానికి సీబీఐ తరపు న్యాయవాది వివరించారు.
సీబీఐ అడిగిన సమాచారాన్ని తాము ఎప్పటికప్పుడు ఇస్తున్నామని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాల న్యాయవాదులు చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జనవరి 25వ తేదీలోపు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అందులో అంశాలు, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్‌కు తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత అఫిడవిట్‌ను పరిశీలించి ఏం చేయాలన్న అంశంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. మొత్తానికి పంచ్ ప్రభాకర్ విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకోవడం.. సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండడం గమనార్హం.