ఏపీలో అధికార వైసీపీకి వరుసగా కోర్టుల నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఈ రోజు రెండు విషయాల్లో కోర్టు నుంచి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. సినిమా టికెట్ల పెంపు విషయంలో కేవలం హైకోర్టులో పిటిషన్ వేసిన వారికి మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచుకునే హక్కు ఉంటుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. టిక్కెట్ రేట్లు పెంచుకొనే హక్కు అందరూ థియేటర్ల యజమానులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోలు కోసం చేస్తున్నవిషయంలో కూడా ఈరోజు హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది.
సౌర విద్యుత్ కొనుగోళ్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆదాని పవర్ ద్వారా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. సీపీఐకి చెందిన రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... జగన్ సర్కార్ తోపాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. అయితే మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరల కంటే ప్రభుత్వం కొనుగోలు చేసే రేటు ఎక్కువుగా ఉండడంతోనే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయినా ప్రభుత్వం తాము అనుకున్న రేటుకే విద్యుత్ కొనుగోలు చేస్తామని ముందుకు వెళ్లింది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చూస్తే విద్యుత్ యూనిట్ రు 2.05 దొరుకుతుంటే.. దానిని కొనకుండా కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీ నుంచి ఆదానీ పవర్ తీసుకుని.. దానిని రు 2.45కు కొనుగోలు చేయడం అంటేనే ఏదో గోల్‌మాల్ అన్న అనుమానాలు వచ్చేశాయి. దీనిపై సీపీఐ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే ఎక్కువ రేటకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏం ఉందని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు వివరణ కోరుతూ జగన్ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఆదానీ సంస్థతో పాటు రాష్ట్ర ఇంధన శాఖతో పాటు మరో 10 మందికి నోటీసులు జారీ అయ్యాయి. మరి వీరు దీనిని ఎలా సమర్థించుకుంటారో ? ఏమని వివరణ ఇస్తారో ? చూడాలి.