అపార్ట్ మెంట్ సెల్లార్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ మంత్రి

Update: 2020-08-05 17:35 GMT
కరోనా దెబ్బకు లెక్కలన్ని మారిపోతున్నాయి. భౌతికదూరం.. ముఖానికి మాస్కు కట్టుకోవటం.. తరచూ చేతులకు శానిటైజర్లు పూసుకోవటం లాంటివే కాదు.. గతానికి భిన్నమైన సీన్లు చాలానే చోటు చేసుకుంటున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా విలేకరులసమావేశాన్నినిర్వహించే తీరులోనూ మార్పు వచ్చేసింది. గతంలో తరచూ ప్రెస్ మీట్ పెట్టే నేతలు.. ఇప్పుడు చాలా తక్కువగా పెడుతున్నారు. వీడియో సందేశాల్ని పంపుతూ.. తామేం చెప్పాలనుకున్నామో చెబుతున్నారు. ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ మంత్రి మేకపాటి సుచరిత ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.

తొలుత బేగంపేటలోని గెస్ట్ హౌస్ లో పెట్టాలనుకున్న ఆమె.. ఆ వెంటనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. కరోనా వేళలో కొత్త ప్రాంతంలో వైరస్ సమస్య ఉంటుందన్న ఆలోచనలో మణికొండలోని తమ నివాసంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. కానీ.. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. గతంలో ఇలాంటి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసినప్పుడు ఇంట్లో సాదరంగా ఆహ్వానించి తాము చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేవారు. ఇప్పుడు కరోనా కాలం నడుస్తుండటంతో.. ఇంట్లో కాకుండా అపార్ట్ మెంటు సెల్లారులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ మధ్య కాలంలో రాజధాని ఎపిసోడ్ కు సంబంధించి ఏపీ అధికారపక్షం రాజీనామా చేయాలని విపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్న వేళ.. ఏపీ హోంమంత్రి మేకపాటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో టీడీపీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్ని ముందు రాజీనామా చేయించాలని కోరారు. రాజధానిని తరలించటం లేదని.. అభివృద్ది వికేంద్రీకరిస్తున్నామని చెప్పారు. రాజధాని రైతుల కౌలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దన్న ఆమె.. కాశీబుగ్గలో దళితుడ్నికాలితో తన్నిన సీఐను సస్పెండ్ చేశామని.. రాజామండలం.. చీరాల ఘటనలకు కారణమైన అధికారుల్ని సస్పెండ్ చేసిన వైనాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో చింతమననేని.. ఆదినారాయణరెడ్డిలు దళితుల్ని కించపరిచేలా వ్యవహరిస్తే కనీసం మందలించలేదన్న ఆమె.. బాబు తీరును తీవ్రంగా విమర్శించారు.
Tags:    

Similar News