ప్రత్యర్థుల నుంచే కాదు.. తన స్వపక్షం నుంచి అందులోకి తన కింద పని చేసే వారి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మంగళవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించటం.. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుఫోన్ల ట్యాపింగ్ సంబంధించిన అంశాల్ని చర్చించేందుకు.. ఇంటెలిజెన్స్‌తో పాటు డీజీపీ రాముడిని ప్రత్యేకంగా పిలిపించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ధోరణిని తప్పుపడతూ.. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ఏపీ మంత్రులు.. ముఖ్యమంత్రి నిలదీసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. మంత్రులు యనమల.. అచ్చెన్నాయుడు తదితరులు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ అనురాధపై ప్రశ్నల వర్షం కురిపించటంతో కంగుతిన్న ఆమె ఊహించని విధంగా వ్యవహరించారనిచెబుతున్నారు.
మంత్రుల ప్రశ్నలకు ఘాటుగా స్పందించిన ఆమె.. తెలంగాణ మంత్రులు.. అధికారుల ఫోన్లపై నిఘా పెడితే తమ పరిస్థితి ఏం కావాలని ఎదురు ప్రశ్నించినట్లుచెబుతున్నారు. అంతేకాదు.. సమావేశం మధ్యలోనే ఆమె వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అధికారిక వాహనం అక్కడే వదిలిపెట్టి.. ప్రైవేటు వాహనంలో వెళ్లిపోవటం పలు సందేహాలకు తావిస్తోంది.
ముఖ్యమంత్రి సమక్షంలో ఒక బాధ్యతాయుతమైన ఒక ఉన్నతాధికారి అలా చేసే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎదురు సమాధానం చెప్పే కన్నా.. ఆమెపై ఏపీ మంత్రివర్గం అగ్రహం వ్యక్తం చేయటంతోపాటు.. ఆమె బాధ్యతల విషయంలో పునరాలోచనలో పడి ఉంటారని.. దీన్ని గమనించి ఆమె తన ప్రైవేటు వాహనంలో వెళ్లారన్న వాదన ఉంది.
అనురాధ తీరు మీద నొచ్చుకున్న ఏపీ మంత్రివర్గం.. ఆమెను వెంటనే తొలిగించాలని పట్టుపట్టినట్లు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేస్తే మరిన్ని విమర్శలు రావచ్చు అని.. కొంతకాలం ఆగుదామని చంద్రబాబు వారించినట్లు చెబుతున్నారు. తాము పని చేస్తున్న ప్రభుత్వం పట్ల కమిట్‌మెంట్ ప్రదర్శించని అధికారులకు ఉన్నతస్థానాల్లో కూర్చోబెడితే ఇలానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా.. ఏపీ సీఎం అండ్ కోకు ఊహించని షాక్‌ను అనురాధ ఇచ్చారని అంటున్నారు. మరి.. దీనిపై ఆమె వివరణ ఇస్తారో.. పట్టించుకోరో చూడాలి.