సంక్షేమ 'కోతల' రాజ్యం అందామా.. జ‌గ‌న‌న్నా..!

Update: 2022-12-26 01:30 GMT
ఏపీలో సంక్షేమ రాజ్యం ఏర్ప‌డింద‌ని.. రాజన్న రాజ్యం న‌డుస్తోంద‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇది ఇప్పుడు సంక్షేమ 'కోత‌ల' రాజ్యంగా మారింద‌నే టాక్ బాహాటంగానే వినిపిస్తోంది. ఇక్క‌డ 'కోత‌లు' అంటే డ‌బుల్ మీనింగ్ అర్ధ‌మే వ‌స్తోంది. ఎక్క‌డ విన్నా.. ఎక్క‌డ క‌న్నా.. ఇది సంక్షేమ కోత‌ల ప్ర‌భుత్వం.. అనే టాక్ రావ‌డం గ‌మ‌నార్హం.

త‌మ ప్ర‌భుత్వం 75 శాతం చేస్తుంటే.. మిగిలి 25 శాతం లోటును చూపిస్తూ.. ప్ర‌తిప‌క్షాలు.. ఓ వ‌ర్గం మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తోంద‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అయితే.. నిజంగానే తాము నిజాయితీగా ప‌నిచే స్తుంటే.. ఎవ‌రు మాత్రం ఏం చేస్తారు?  కానీ అలా జ‌ర‌గక పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు స‌మ‌స్య వ‌స్తోంది. రాష్ట్రంలో అభివృద్ది లేద‌ని ఎవ‌రైనా అంటే..వెంట‌నే తమ‌ది సంక్షేమ రాజ్య‌మ‌ని.. రాజన్న రాజ్య‌మ‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

కాని, ఇప్పుడు అదేసంక్షేమానికి ఎస‌రు పెడుతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా పింఛ‌న్ల‌ను తొల‌గించే ప్ర‌క్రియ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. 5 ల‌క్ష‌ల మంది పింఛ‌న్లు తొల‌గించేందుకు.. ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింది.

వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఈ పింఛ‌న్లు ఆగిపోతాయి. అయితే.. ఇక్క‌డ ఒక లాజిక్ ఉంది. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి పింఛ‌న్‌ను 250 చొప్పున పెంచి ల‌బ్ధిదారుల‌కు రూ.2750 చొప్పున ఇవ్వ‌నున్నారు. ఇది జ‌గ‌న్ చెప్పిందే.

అంటే.. పింఛ‌న్లు పెంచుతున్నామ‌ని.. కోత‌లు(గొప్ప‌లు) చెప్పుకొంటున్నారు. అలా ప్ర‌తి ఒక్క‌రూ దీనిని ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో ఉన్న పింఛ‌న్ల‌కు విద్యుత్ 300 యూనిట్లు, సొంత ఇల్లు, ప‌న్నులు క‌డుతున్నార‌ని..  కోత‌లు కోసి.. వాత‌లు పెడుతున్నారు.

అంటే.. ఒక చేత్తో రూ.250 పెంచి.. మ‌రో చేత్తో.. ఆ నిధులు స‌ర్దుబాటు చేసుకునేందుకుల‌బ్ధిదారుల్లోనే కోత‌లు పేడుతున్నారు. దీంతో ఇప్పుడు.. ఏపీలో ఉన్న‌ది సంక్షేమ కోతల రాజ్య‌మ‌నే టాక్ జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News