ఏపీకి 3 రాజధానులు అవసరమని జగన్ ప్రకటించడం.. ప్రతిపక్ష చంద్రబాబు, పవన్ రోడ్డెక్కడం.. నానా యాగీ చేస్తుండడం తెలిసిందే.. అయితే ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరుఫున ఎవరైనా చెప్పారా? ’ అంటూ ప్రశ్నించారు. అమరావతి రాజధాని కాదని ఎవరన్నారని.. ప్రభుత్వం తరుఫున ఎవరైనా చెప్పారా ? మూడు రాజధానులనేవి ఆలోచన మాత్రమేనని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అమరావతిని ఎవరూ తరలించడం లేదని.. చంద్రబాబులా భ్రమరావతిని సృష్టించక సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారని మంత్రి వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్, కన్నా, సుజనాచౌదరి, చంద్రబాబు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదని.. అమరావతి తరలిపోదని మంత్రి అన్నారు. నిన్నటిదాకా విదేశాల్లో షూటింగ్ చేసి వచ్చిన పవన్.. ఇప్పుడు మంగళగిరిలో రైతులతో కలిసి షూటింగ్ లో పాల్గొన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఉండి ఇక్కడి రైతుల గురించి మాట్లాడడం కాదని.. దమ్ముంటే విజయవాడ కు మకాం మార్చు అంటూ సవాల్ చేశారు. అతిథిగా ఒకటి రెండు రోజులు ఒక్కడికొచ్చి సినిమా డైలాగులు చెబతే ప్రజలు నమ్మరని కౌంటర్ ఇచ్చారు.
ఇక ఎమ్మెల్యేలు జోగిరమేష్, మల్లాది విష్ణులు కూడా రెండు చోట్ల ఓడిన పిచ్చి తుగ్లక్ పవన్ మాకు చెబుతారా అంటూ నిప్పులు చెరిగారు.