ఏపీ కలల ప్రాజెక్టు 'పోలవరం' పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి.. చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలు, దోపిడీకి చెక్ పెట్టిన వైసీపీ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ '(ఎంఈఐఎల్) సంస్థకు అప్పగించింది. లెస్ టెంటర్ తో కాంట్రాక్టు పొందిన మెయిల్ సంస్థ నవంబర్ 1 పనులు ప్రారంభించింది. ప్రాజెక్టు స్పిల్ వే వెనుక భాగంగా సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు.
ఈ గురువారం నుంచి పోలవరం పనులు వాయువేగంతో చేపట్టేందుకు మెయిల్ సంస్థ శ్రీకారం చుడుతోంది. స్పిల్ వే ప్రాంతంలో పనులకు శ్రీకారం. తొలిరోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను దిగ్విజయంగా పూర్తిచేయడానికి సంకల్పించింది. రోజుకు 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు లక్ష్యంగా ముందుకెళ్లాలని కంపెనీ నిర్ణయించింది.
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మెయిల్, ఏపీ నీటిపారుదల శాఖ ప్రణాళికలు రెడీ చేసింది. ఈ క్రమంలోనే రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ , కాపర్ డ్యామ్ పనులను పూర్తి చేయడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ సిద్ధమైంది. రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు, 2021 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తిచేస్తామని మేఘా సంస్థ ప్రకటించింది.
2020 సంవత్సరాంతానికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండేలా ఏపీ ప్రభుత్వ సంకల్పించింది. దీనికి మేఘా సంస్థ కూడా తోడ్పాటు నందిస్తూ శరవేగంగా పనులు పూర్తి చేయడానికి నడుం బిగించింది.