ఏపీలో రాజకీయాలు ముదిగి పాకానపడుతున్నాయి. అవి ఎంతదాకా వెళ్తున్నాయి అంటే స్థానికంగా ఉంటున్న వారికే తెలియనంతంగా. అసలు తమ గ్రామంలో అలా జరుగుతోందా అని వారే ఆశ్చర్యపోయేటంతగా. ఇప్పటంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఎనిమిది కోట్ల రూపాయలతో. దీనికి ప్లానింగ్ అంతా మార్చి నెలలోనే జరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటంలో తమ పార్టీ సభ జరుపుకోవడానికి గ్రామస్తులు భూములు ఇచ్చారు కాబట్టే ప్రభుత్వం అక్కడ ఇళ్ళను కూల్చుతోందని జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని అక్కడ గ్రామస్థులు పలువురు తోసిపుచ్చుతున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ కి భూములు ఇచ్చిన చోట ఎక్కడా ఒక్క జేసీబీ కూడా వెళ్ళలేదని, అభివృద్ధి జరిగేది, రోడ్లను వేసేది వేరే ప్రాంతమని వారు అంటున్నారు. ఇక తమ ఊరిలో అభివృద్ధి కోసం తాము తపనపడుతూంటే కొందరు జనసేన నాయకులు లేనిపోనివి కల్పించి చెప్పారని, ఇపుడు దాన్ని పట్టుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటం రావడం మీద కూడా వారు విమర్శలు చేస్తున్నారు.
నిజానికి ఇప్పటం అభివృద్ధి కోసం జనసేన సభలో పవన్ కళ్యాణ్ యాభై లక్షల రూపాయలను ఇస్తామని చెప్పారని ముందు ఆ మొత్తం గ్రామానికి ఇచ్చి అక్కడకు వస్తే బాగుంటుందని వారు అంటున్నారు. ఇప్పటికి నెలలు గడచినా ఆ మొత్తం చెల్లించలేదని వారు గుర్తు చేస్తున్నారు. మరో వైపు తమ ప్రాంతానికి రోడులు, లైట్లు, డ్రైనేజ్ వంటివి రావాల్సిన అవసరం ఉందా లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా యాభై లక్షలు ఇస్తే మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది, ఇప్పటం గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని వారు సూచిస్తున్నారు. ఇప్పటం గ్రామాన్ని రాజకీయాలో కోసం బలిచేయవద్దు అని కూడా పలువురు కోరడం విశేషం.
ఇక ఇప్పటంలో అక్రమ కూలివేతల విషయాల మీద కూడా గ్రామస్తులు చెబుతున్నదేంటి అంటే అవన్నీ అక్రమంగా కట్టుకున్నవేనని. అయితే ఈ విషయంలో కూడా కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలు లేవనే అంటున్నారు
మొత్తానికి చూస్తే ఇప్పటం అన్న చిన్న వూరు ఇపుడు రాజకీయాలకు కారణం అవుతోంది. అదే విధంగా అక్కడ పవన్ కళ్యాణ్ నాడు చెప్పిన ప్రకారం యాభై లక్షలు కూడా చెల్లించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటంలో యాభై లక్షలను గ్రామస్తులకు ఇవ్వాలనుకుంటే సీయార్డీయే తమకు జమ చేయమని అడుగుగొతందని జనసేన వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎటు తేలుతుందో ఆలోచించాలి చూడాలి మరి ఇప్పటం రాజకీయం ఎంతదాకా వెళ్తుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.