బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి చింతమనేని లాంటి నేతలు ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోతుంది. బాబు సర్కారుపై పడిన మచ్చట్లో చింతమనేని వారి పుణ్యం ఎంతన్నది అందరికి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలతో.. చేష్టలతో తరచూ వార్తల్లో నిలిచే ఆయన తాజాగా మరోసారి చెలరేగిపోయారు. తన తీరుతో వివాదాస్పదం కావటమే కాదు.. వార్తల్లోకి ఎక్కేశారు.
ఇంతకీ.. ఈసారి చింతమనేనికి కోపం ఎందుకు వచ్చిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆర్టీసీ బస్సుకు అంటించిన సీఎం చంద్రబాబు బొమ్మ చిరిగిపోవటంపై ఆయన చిందులు వేశారు. బాబు బొమ్మ బస్సుపై చిరిగితే బస్సు డ్రైవర్.. కండక్టర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించటమే కాదు.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ సిబ్బందిపై చింతమనేని హడావుడిని ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని హనుమాన్ జంక్షన్ లోని అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి హనుమాన్ జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.
ఈ బస్సుపై ప్రభుత్వ ప్రచార పోస్టర్ ఒకటి అంటించారు. ఆ పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కాస్త చినిగి ఉంది. దీంతో ఆగ్రహం చెందిన చింతమనేని.. తన మనుషులతో బస్సును అడ్డగించారు. డ్రైవర్.. కండక్టర్ లను కిందకు దించి.. పరుష పదజాలాన్ని ప్రయోగించటంతో అందరూ అవాక్కు అయ్యే పరిస్థితి.
ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫోటో చిరిగినా పట్టించుకోరా? అని నిలదీశారు. ఇదంతా చూస్తున్న స్థానికుడు ఒకరు స్పందించి.. ప్రభుత్వ ఉద్యోగులతో ఎమ్మెల్యే ఇలాంటి తీరును ప్రదర్శించటం ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో సదరు స్థానికుడిపై చేయి చేసుకోవటంతో అక్కడి వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఉదంతాన్ని పలువురు తప్పు పడుతున్నారు. బస్సు మీద అంటించిన పోస్టర్ చిరిగినా ఆర్టీసీ బస్సు ఉద్యోగులదే బాధ్యతంటూ చింతమనేని వారి మాటల్ని పలువురు తప్ప పడుతున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.