తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు భూకబ్జా కేసుల్లో దీపక్‌రెడ్డిపై అభియోగాలున్నాయి. లేని వ్యక్తులు ఉన్నట్లు సృష్టించి, నకిలీ పత్రాలతో వందల ఎకరాలను దీపక్‌రెడ్డి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు లాయర్ శైలేష్, బ్రోకర్‌ను అరెస్ట్ చేశారు.
అనంతపురం టీడీపీ ఎంపీ, సీనియర్ రాజకీయ వేత్త జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారహిల్స్ లలో దీపక్‌రెడ్డి గ్యాంగ్ భూకబ్జాలకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. దీపక్ రెడ్డి పరారీలో ఉండటంతో సుదీర్ఘ కాలంగా ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే దీపక్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన సమాచారం అందుకున్న డీసీపీ అవినాశ్ మహంతి ఆయన అరెస్టు చేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో పోలీసుల బృందంతో వెళ్లారు. దీపక్‌రెడ్డిని పట్టుకున్న అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చినట్లు సమాచారం. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పరిణామం తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఇటీవలే దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దల సభలోకి ప్రవేశించిన దీపక్ రెడ్డి పొరుగు రాష్ట్రంలో అరెస్ట్ అవడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Full View