దేశంలో వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖానికి మాస్క్ పెట్టుకోవడం , భౌతికదురం పాటించడం ..శానిటైజ్ చేయడం అనివార్యం అయిపోయింది. ఇదే విషయమై మాస్క్ పెట్టుకోవాలంటూ ఓ అధికారికి అక్కడ పనిచేస్తున్న మరో మహిళ ఉద్యోగి సూచించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ అధికారి మహిళ అని చూడకుండా కూడా ఆమెపై దాడికి దిగాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అవ్వడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీసులో చోటుచేసుకుంది.
ఏపీ టూరిజం కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ రావు ముఖానికి మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి ముఖానికి మాస్క్ పెట్టుకోమని సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్ రావు దివ్యాంగురాలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
మహిళ అని కూడా చూడకుండా ఇనుపరాడ్డుతో కొట్టాడు. పలువురు ఉద్యోగులు అడ్డుకున్నప్పటికీ.. అతను శాంతించలేదు. అయితే భాస్కర్ రావు కు, ఉషారాణికి మధ్య గతంలో ఎలాంటి గొడవలు లేవు. దీనిపై స్పందించి పై అధికారులు విచారణకు ఆదేశించారు. కలెక్టర్ సైతం ఆరోజు కార్యాలయంలో ఏం జరిగిందన్న దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు.
ఈ ఘటన ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా స్పందించారు. బాధితురాలితో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు కార్యాలయంలో ఏం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సైతం అధికారును ఆదేశించారు.