పర్యాటరంగంలో ఏపీ అత్యంత వెనకబడిపోయింది. ఇది కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్. ఏపీలో మూడున్నరేళ్ళ వైసీపీ ఏలుబడిలో పర్యాటక శాఖ పడకేసింది అని చెప్పడానికి ఈ దిగజారిన ర్యాంకులే సాక్ష్యమని అంటున్నారు. చంద్రబాబు సీఎం గా ఉండగా టీడీపీ అధికారంలో ఉండగా టాప్ టెన్ లో 9వ స్థానంలో ఏపీ ఉంది. 2018లో ఆ ర్యాంకు సాధించుకుని ఏపీ దిట్టంగా నిలబడితే వరసగా మూడేళ్ల కాలంలో వైసీపీ ఏలుబడిలో 12, 17, 18 ర్యాంకులతో పాతాళం వైపుగా పరుగులు తీస్తోంది.
దీనికి కారణం ఏపీలో పర్యాటక శాఖ పనితీరు మందగించడమే అంటున్నారు. తొలి రెండున్నరేళ్ళు అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఈ శాఖను చూశారు. గత ఆరు నెలలుగా రోజా ఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్యనే విశాఖ టూర్ కి వచ్చిన రోజా ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకీ ప్రకటనలే తప్ప పని లేదు. గతంలోనూ ఇపుడూ పనిచేసిన ఇద్దరు టూరిజం మంత్రులు కూడా సరైన పాలసీని తీసుకుని రావడంలో విఫలం అయ్యారని అంటున్న్నారు.
ఏపీలో అనేక ప్రాంతాలను టూరిజం స్పాట్స్ గా అభివృద్ధి చేయవచ్చు. ఏపీలో టెంపుల్ టూరిజంతో పాటు బ్యూటీ ఫుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయవచ్చు. ఇక విశాఖ చూస్తే ప్రముఖ టూరిజం స్పాట్ గా ఉంటూ వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయమలో విశాఖ సహా ఉత్తరాంధ్రాలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కానీ వాటిని కొనసాగించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని అంటున్నారు.
పైగా విశాఖ రాజధాని అంటూ కొత్త నినాదాన్ని అందుకుని అన్ని విధాలుగా రాజకీయంగా విశాఖను బలి చేశారు అని విమర్శలు ఉన్నాయి. దాంతో ఎటూ కాకుండా ఏపీ టూరిజం దారుణంగా మారిందని, సౌత్ ఇండియాలో చూస్తే అన్ని రాష్ట్రాల కన్నా వెనకబడిపోయిందని అంటున్నారు. ఇక టూరిజం లో ఇచ్చిన ర్యాంకులు చూస్తే కేరళ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ సెకండ్ ప్లేస్ లో ఉంది.
గతంలో 13వ ప్లేస్ లో ఉన్న గుజరాత్ ఏకంగా రెండవ ప్లేస్ లోకి రావడం అంటే గ్రేట్ అనుకోవాలి. ఇక తమిళనాడు 12వ ర్యాంక్ ని సాధించింది. కర్ణాటక 16వ స్థానంలో ఉంటే తెలంగాణా 17వ ప్లేస్ లో ఉంది. ఏపీ అద్వాన్నంగా 18వ ప్లేస్ లో ఉండడం అంటే దారుణం అనే అనాలి. ఇది వైసీపీ సర్కార్ పెద్దలకు షాకింగ్ పరిణామం అని అంటున్నారు.
ఇక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎంతసేపూ రాజకీయ విమర్శలు చేయడం తప్ప తన సొంత శాఖ మీద దృష్టి పెట్టడంలేదని అంటున్నారు. అందుకే రిజల్ట్స్ వచ్చే ఏడాదికి అయినా మారుతాయన్న నమ్మకాన్ని ఎవరూ వ్యక్తం చేయడంలేదు. ఈ విధంగా చూస్తే అన్ని విభాగాల్లో ర్యాంకులు వెనక్కు అప్పుల్లో మాత్రం ఏపీ ముందుకు వస్తోందనే బాధ వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.