రోజుకు 10 లక్షలమందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తాం

Update: 2020-10-16 17:34 GMT
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చే డిసెంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వస్తే పంపిణీపై అప్పుడే వివిధ దేశాలు ప్లాన్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ మేరకు సమాయత్తమవుతోంది.

ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక.. రోజుకు 10 లక్షల మందికి అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ శోభనా కామినేని తెలిపారు.

దేశంలో అపోలో గ్రూపుకు 70 ఆస్పత్రులు, 400 క్లినిక్ లు, 500 కార్పొరేట్ హెల్త్ సెంటర్లు, 4వేల ఫార్మాసీలు ఉన్నాయని.. వీటి ద్వారా భారత్ లోని ప్రజలకు వేగంగా వ్యాక్సిన్ అందిస్తామని శోభనా తెలిపారు.

వ్యాక్సిన్ నిల్వ, సరఫరాకు అవసరమైన వ్యవస్థ, 10వేల మంది శిక్షణ పొందిన నిపుణులను తాము ఇప్పటికే సిద్ధం చేశామని శోభన తెలిపారు.

ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యాక్సిన్ తయారీ, పంపిణీపై ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించింది. దేశంలోని పాపులర్ ఫార్మా కంపెనీలతోనూ చర్చించారు.. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఫార్మా దిగ్గజాలు కూడా వ్యాక్సిన్ పంపిణీకి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tags:    

Similar News