తాను చేసింది తప్పు అన్న మాట ఎవరి నోట అయినా వస్తుందేమో కానీ.. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోట నుంచి వస్తుందని కలలో కూడా అనుకోలేం. అయితే..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ విషయం ఇప్పటికే పలువురి విషయంలో నిజమైంది. తాజాగా నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో ముంచుకొస్తున్న ముప్పును గుర్తించిన దీదీ.. కొత్తగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటివరకూ తాను చేసింది మాత్రమే రైట్ అనే ఆమె.. ఎన్నికలు త్వరలో ముంచుకొస్తున్న వేళ.. మోడీషాల ముప్పును ఎదుర్కొనేందుకు సరికొత్తగా రియాక్ట్ కావాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. పేరుకు సాదాసీదాగా ఉన్నట్లు కనిపించినా.. నిలువెత్తు అహంకారం దీదీ సొంతమని వ్యాఖ్యానించే వారు చాలామందే కనిపిస్తుంటారు. నాన్ స్టాప్ గా బెంగాల్ కోటకు తిరుగులేని శక్తిగా ఉన్న మమతను దెబ్బ తీసేందుకు మోడీషాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టటం.. సార్వత్రిక ఎన్నికల్లో కమలనాథులు తన సత్తాను ప్రదర్శించటం తెలిసిందే.
బెంగాల్ కోటను తాము క్రాక్ చేశామని.. రానున్న రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని నమ్మకంగా చెబుతున్న కమలనాథుల ఆశల్ని వమ్ము చేసేందుకు దీదీ కొత్త అవతారం ఎత్తినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆమె నోటి నుంచి వచ్చిన మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ప్రజలతో మరింత విధేయతతో మెలుగుదామని.. గతంలో చేసిన తప్పులకు క్షమాపణలు కోరుదామని మమత వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమను దెబ్బేసిన బీజేపీ మరింత బలపడకుండా ఉండేందుకు వీలుగా తన వెర్షన్ ను మార్చుకోవాలన్న భావనను దీదీ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పని తీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని.. కొద్దిమంది నేతలు సరిగాపని చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. అక్రమ కమీషన్లు తీసుకోవటం పైనే దృష్టి పెట్టారన్న ఆమె.. తప్పులకు సారీ చెబుదామని దీదీ డిసైడ్ కావటం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు.