ఐ ఫోన్ ప్రేమికుల నిరీక్షణ ఫలించినట్లే. ఒక్కసారి అలవాటు పడితే.. మళ్లీ మళ్లీ వాడాలనిపించటమే కాదు.. దాన్నే మాత్రం విడిచి పెట్టేందుకు ఇష్టపడని తీరు ఐఫోన్ వినియోగదారుల్లో కనిపిస్తుంది. అయితే.. ఐఫోన్ తో వచ్చి పడే చిక్కేమిటంటే.. ఆ ఫోన్ లో ఒక్క సిమ్ వేసుకునే వీలు మాత్రమే ఉంటుంది. సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లుగా రూపాంతరం చెందక ముందే..రెండు సిమ్ ల ఫీచర్ వచ్చేసినప్పటికీ.. ఐఫోన్ మాత్రం రెండు సిమ్ లలో తన ఫోన్ ను తీసుకొచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు.
మారిన కాలానికి తగినట్లుగా మార్పు తప్పనిసరి కావటం.. ప్రతిఒక్కరికి రెండు సిమ్ లు ఉండటం మామూలైన వేళ.. ఐఫోన్ ఎట్టకేలకు తన తీరును మార్చుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ ప్రేమికులు ఎంతో కాలంగా కోరుకుంటున్నట్లుగా రెండు సిమ్ లతో ఫోన్ ను రూపొందించే దిశగా యాపిల్ అడుగులు వేయటం షురూ చేసింది. దీనికి సంబంధించిన కీలక పరిణామం తాజాగా చోటు చేసుకుంది.
మరికొద్ది రోజుల్లోనే ఐఫోన్ డ్యూయల్ సిమ్ తో రానున్నట్లు చెబుతున్నారు. డ్యూయల్ సిమ్ తో ఫోన్లను తయారు చేసేందుకు అవసరమైన పేటెంట్ ను పొందిందన్న వార్త ఐఫోన్ లవ్వర్స్ కు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తోంది. డ్యూయల్ సిమ్ టెక్నాలజీకి సంబంధించి యాపిల్ సంస్థ అమెరికాలో ఇటీవల పేటెంట్ హక్కుల్ని పొందింది. దీంతో.. డ్యూయల్ సిమ్ సెల్ ఫోన్ల మార్కెట్లోకి యాపిల్ అడుగు పెడుతున్నట్లుగా చెప్పొచ్చు. 2017లో విడుదల చేసే ఐఫోన్8లో చాలానే మార్పులు చేస్తుందని.. ఆ మార్పుల్లో అతి పెద్దది.. కీలకమైనది డ్యూయల్ సిమ్ ఏర్పాటు అని చెబుతున్నారు. సో.. ఐఫోన్ కొనాలనుకునే వారు కాస్త ఆలోచించి కొనటం మంచిదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/